మెదడు,మెదళ్ళు!!!

కొంతమంది మెదళ్ళు జ్ఞాపకాలతో తొలుస్తూ ఉంటాయి, "కొంతమంది" బహువచనం కాబట్టి "మెదళ్ళు" పదం వాడాను, అంతేగానీ ప్రతిమనిషికి రెండో,మూడో మెదళ్ళు ఉంటాయని కాదు నాఉద్దేశ్యం!ఉన్న ఒక మెదడుతో ఏంచేసుకోవాలో, ఎలావాడాలో తెలియక చస్తున్నాం- ఇంకా మెదళ్ళు కూడానా!అయినా నాకేమైనా మెదడు లేదా,మెదళ్ళు అంటానికి!?ఆ మాత్రం మెదడు ఉందండోయ్!

ఇక మెదడు విషయానికివస్తా,ఇంకా మీమెదళ్ళు తినకుండా-నేనేమైనా మెదళ్ళు తినేవాడినా- తిండి తినకుండా!?

మన మెదడు, జ్ఞాపకాలు తొలవడం సర్వసాధారణం.మంచి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకోవడం- మెదడుకి,శరీరానికి ఆరోగ్యకరం కూడానాయే.

కానీ చాలామంది “బాధపెట్టిన జ్ఞాపకాలను” మాత్రమే గుర్తుచేసుకుంటారు, అదిగో అక్కడే మొదలవుతుంది అసలు తంటా!

ఇదికూడా మీమెదడు చేసే విన్యాసమే మరి.మీ మెదడు జ్ఞాపకాల తుట్టెలను లేపడానికి ప్రయత్నిస్తుంది.తేనెతుట్టెలను లేపితే జరిగే పర్యవసానం ఏంటో మనకు తెలుసు-కుట్టి చంపుతాయి తేనెటీగలు!(లాఘవంగా తేనె తీసుకోవాలిగానీ.......)

అలాగే మీ మెదడు ఇలా కదిపినప్పుడు మీరు మీమెదడుని ఆధీనంలోకి తెచ్చుకొని "చెడు జ్ఞాపకాల" పెట్టెల తాళాలు తీయకుండా,”మంచివాటి జోలికి” మాత్రమే వెళ్లేట్టు మెదడుని కట్టడి చేయండి.ఎందుకు వినదు మీమాట? మీ మెదడు కదా ఆది!

మీకో రహస్యం చెప్పనా! అసలు మెదడు మనల్ని చెప్పమని,దాని ప్రకారం మెసలుకుందామని అనుకుంటుంది ఎప్పుడూకూడా.మన బద్ధకానికో, చేతకానితనానికో మనం అన్నీ దానికే వదిలేస్తాం,అక్కడ వస్తుంది చిక్కు -అప్పుడది పెడ్తుంది చికాకు.

మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి-మీమెదడుకి పనిచెప్పటానికి, దాని మానాన ఆది ఇష్టారాజ్యంగా పనిచేయకుండా! "ప్రయత్నే ఫలీ" కూడానండీ,"కష్టే ఫలీ" మాత్రమే కాదు!

ఇంకెందుకు ఆలశ్యం,మెదడు తుట్టెను మీరు కదిపి,కుదపండి.ఇక అన్నీ మంచి జ్ఞాపకాలనే మీ మెదడు తొలుస్తుంది;మీమెదళ్ళు తిన్నాగాని ఒక మంచి విషయం చెప్పా కదర్రా!!!

అయినా ఈ లెవెల్లో మీబుర్ర నేతినబోతే మీ మెదడుకి ఎక్కుతుందా,మీమెదడుకి కాదు,మీకు ఎక్కాలి. మీ మెదడు అనుకుంటుంది-

"వీడేవడో కానీ నా మనసులోమాట వీళ్లకి బాగా చెప్పాడు,బయటవాడైనా సరే-నేచెప్తే అర్ధమయిచావట్లా ఈజనాలకి అని"

మీ మెదడు "తత్వం" బోధపడిందనుకుంటా!ఇంకా సందేహం ఉంటే అడగండి, విపులీకరిస్తా!!!

ఇక నా మెదడు తొలుపుడు ఆపుతా మరి!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!